Site icon NTV Telugu

Avika Gor : ఎంగేజ్మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్..

Avika Gor Gets Engaged

Avika Gor Gets Engaged

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన బాలనటి, నేడు యువహీరోయిన్‌గా వెలుగొందుతున్న అవికా గోర్ తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా ప్రతి ఇంటికీ పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన కొత్త జీవితం వైపు అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీతో అవికా గోర్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వారిద్దరి ఫొటోలు, కెమిస్ట్రీ ఎప్పటికప్పుడు హైలైట్ అవుతునే ఉంటాయి.

Also Read : Kalpika pub incident : పబ్ లో గబ్బు.. కల్పికపై కేసు

తన ప్రేమికుడు మిలింద్ చాంద్వానీతో నిశ్చితార్థం జరిగిందని, బుధవారం (జూన్ 11) తన సోషల్ మీడియా ఖాతాలో ‘ఇది నిజమైన శుభవార్తే’ అంటూ.. ఓ హృద్యమైన పోస్ట్‌తో తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలో అవికా మిలింద్ చేతులు పట్టుకుని హాయిగా నవ్వుతూ కనిపిస్తే, మరొక ఫొటోలో ఆయన బుగ్గపై ముద్దు పెడుతూ కనిపించారు. ఈ ఫొటోలు క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు అవికా‌కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’గా మన హృదయాల్లో స్థానం సంపాదించిన అమ్మాయి, నిజ జీవితంలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఇన్నేళ్ల ప్రేమకు ఇప్పుడు అధికారిక ముద్ర పడింది. త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

Exit mobile version