2015లో వచ్చిన ప్రేమమ్ మలయాళంలో ఓ కల్ట్ క్లాసిక్. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నివిన్ పౌలీని, డెబ్యూ బ్యూటీ సాయి పల్లవిని ఓవర్ నైట్ స్టార్లుగా మార్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో పల్లవి కుర్రకారును ఫిదా చేసేసింది. మేడమ్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. కానీ నివిన్ సిచ్యుయేషన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ లేక సతమతమౌతున్నాడు. హిట్ అనే సౌండ్ విని దాదాపు ఆరేళ్లవుతుంది. లవ్ యాక్షన్ డ్రామా తర్వాత ప్రేక్షకులను మెప్పించటంలో ఫెయిల్యూర్ అయ్యాడు ఈ మలయాళ హీరో.
Also Read : Ramayana Movie : రణబీర్.. యష్.. ‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్
లవ్ యాక్షన్ డ్రామా తర్వాత నివిన్ ఏడు చిత్రాల్లో నటిస్తే అవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మధ్యలో వర్షంగళుక్కు శేషం హిట్ పడితే ఆ క్రెడిట్ మోహన్ లాల్ సన్ ప్రణవ్ ఖాతాలో పడిపోయింది. ప్రేమమ్ వచ్చి దశాబ్దం అవుతున్నా ఆ రికార్డును చెరిపేయలేకపోతున్నాడు నివిన్. ఇప్పటి వరకు నివిన్ కెరీర్‌లోనే రూ. 75 కోట్లతో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అప్పటి నుండి ఈ నంబర్‌ను బీట్ చేయలేకపోతున్నాడు ఈ మలయాళ హీరో. పేలవమైన స్క్రిప్ట్ సెలక్షన్స్ వరుస డిజాస్టర్లకు కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రూట్ మార్చి హీరోతో పాటు విలన్ రోల్‌కు ఛేంజ్ అవుతున్నాడు. ప్రజెంట్ స్టార్ హీరో చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. వీటిల్లో తమిళ చిత్రాలు యెజు కాదల్ యెజు మలై, లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ బెంజ్ క్యూరియాసిటి కలిగిస్తున్నాయి. బెంజ్‌లో నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇవే కాదు. సర్వం మాయ అనే సినిమా కూడా చేస్తున్నాడు. దాంతో పాటు గిరిష్ ఎడి డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేస్తున్నాడు నివిన్. ఈ సినిమాలతో నివిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
