Aswani Dutt: సెన్సిటివ్ సినిమాలు చేసే నాగి కల్కి చేయగలడని అందుకే నమ్మా

  • కల్కి 2898 ఏడీ సినిమాకి సూపర్ హిట్ టాక్
  • మీడియాతో ముచ్చటించిన అశ్వని దత్
  • నాగ్ అశ్విన్ మీద అసక్తికర వ్యాఖ్యలు
Nag Ashwin Aswani Dutt

Nag Ashwin Aswani Dutt

Aswani Dutt Comments on Nag Ashwin: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కల్కి 2898 ఏడి అనే సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుమారు 600 కోట్లకు పైగా ఈ సినిమా కోసం వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీద నమ్మకం పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గతంలో నాగ్ అశ్విన్ చేసిన రెండు సినిమాలు సెన్సిటివ్ గా ఉంటాయి. అలాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ ఇలాంటి ఒక వైల్డ్ , డెప్త్ ఉన్న సినిమా, యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా చేయగలడని ఎలా నమ్మారు? అని అడిగితే దానికి అశ్వినీ దత్ సమాధానం ఇచ్చారు.

Kalki 2898 AD – Nagarjuna : నాగి వేరే లోకానికి తీసుకెళ్లాడు.. కల్కి పై నాగార్జున కామెంట్స్ వైరల్..

మొదటి సినిమా ప్రూవ్ చేసి రెండో సినిమా చేసిన తర్వాత అతని సత్తా ఏంటో తెలిసింది. ఇతను ఎంత పెద్ద సినిమా అయినా చేయగలడు ఇక ఏ మాత్రం డౌట్ లేదు అని నాకు అనిపించింది. ఇదే విషయాన్ని మా పిల్లలకి కూడా చెప్పాను. అతను ఏ రోజైనా ఏ సబ్జెక్టు చెప్పినా వెంటనే దూకేయండి ఏమాత్రం అనుమానం అక్కర్లేదు అని ఆయన వెల్లడించినట్లు పేర్కొన్నారు. మనకు ఒక మంచి దర్శకుడు దొరికాడు జాగ్రత్తగా సినిమాలు చేసుకోండి అని చెప్పానని అశ్వినీ దత్ వెల్లడించారు. ఇక ఎక్కడ విన్న హ్యాట్సాఫ్ నాగ్ అశ్విన్ అనే మాటలే వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా అశ్విని దత్ చెప్పుకొచ్చారు.