ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఆమె పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె చివరగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి “ఆల్ ఈజ్ వెల్”లో కన్పించింది. తాజాగా అసిన్ తన మూడేళ్ళ కుమార్తె అరిన్ కథక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాన్ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో అరిన్ పిక్ ను షేర్ చేసిన అసిన్ “వీకెండ్ కథక్ ప్రాక్టీస్ 3 ఇయర్స్ ఓల్డ్’ అని రాసుకొచ్చింది. ఈ పిక్ లో 3 సంవత్సరాల అరిన్ పసుపు రంగులో ఉన్న కుర్తా ధరించి అంకితభావంతో కథక్ ను నేర్చుకుంటున్నట్లుగా కన్పిస్తోంది. కాగా అసిన్ కూడా భరతనాట్యాన్ని నేర్చుకుంది. ఆమెకు నటనతో పాటు డ్యాన్స్‌పై మక్కువ ఉండేది.అందుకే భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకుంది. తాజాగా అరిన్ పిక్ చూసిన నెటిజన్లు ‘తల్లిలాగే కూతురు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అసిన్ మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను జనవరి 2016లో వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వారికి ఒక కూతురు అరిన్… ఆమె 24 అక్టోబర్ 2017న జన్మించింది.
కూతురి క్యూట్ పిక్ షేర్ చేసిన అసిన్
