NTV Telugu Site icon

Kalyan Ram: కల్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ

Ashika Ranganath

Ashika Ranganath

Kalyan Ram: ప్రస్తుతం టాలీవుడ్ లో మలయాళ ముద్దుగుమ్మల కాలం నడుస్తోంది. ఒకప్పుడు ముంబైనుంచి ఎక్కువ మంది హీరోయిన్స్ దిగుమతి అయ్యేవారు. ప్రస్తుతం అక్కడ జోరు తగ్గి.. మలయాళ భాష నుంచి కొత్త భామల సందడి కొనసాగుతోంది. అలా ఇప్పుడు కన్నడ నుంచి కాలు పెడుతున్న మరో అందాల భామనే ‘ఆషిక రంగనాథ్’. కల్యాణ్ రామ్ తాజా చిత్రం ద్వారా ఈ సుందరి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. కల్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి ‘అమిగోస్’ అనే వైవిధ్యమైన టైటిల్ ను ఖరారు చేసింది చిత్రబృందం. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు.

Read Also: Vivek Ranjan Agnihotri: ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ మరో సంచలనం

మైత్రీ మూవీ మేకర్స్ వారు అమిగోస్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఆషిక రంగనాథ్ ను తీసుకున్నారు. 2016లో కన్నడ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలెట్టిన ఆషిక, ఇప్పటివరకు పది సినిమాలు చేసింది. కల్యాణ్ రామ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. ఆషిక కూడా గ్లామరస్ హీరోయిన్ కావడం వలన ఆమె ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

Show comments