NTV Telugu Site icon

Kalki 2898 AD : ‘కల్కి’ కాన్వాయ్ మాములుగా లేదుగా

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పాటని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేసారు.

Read Also :SSMB29 : మహేష్ మూవీ కోసం రాజమౌళి ఆ బుక్స్ రిఫరెన్స్ గా తీసుకుంటున్నాడా..?

ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఎప్పుడు చూడని సరికొత్త లోకం లోకి వచ్చిన అనుభూతి చెందుతారని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలపడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు పెరిగాయి.ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ను దేశవ్యాప్తంగా భారీగా ప్లాన్ చేస్తుంది.ఇందుకోసం LED స్క్రీన్స్ ఏర్పాటు చేసిన వాహనాలను ఎంచుకుంది.దీనికి సంబందించిన ఓ వీడియోను కల్కి టీం షేర్ చేసింది.దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభం అవుతుంది అని ట్వీట్ చేసింది.దీనితో కల్కి కాన్వాయ్ మాములుగా లేదుగా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments