గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ ‘జూనియర్’తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా లవ్లీ మూవీ. చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాను. సాయి గారు చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారు. డైరెక్టర్ రాధాకృష్ణ చాలా ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా తర్వాత ఆయన మరిన్ని అద్భుతమైన సినిమాలు చేస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా ఆయనకి చాలా మంచి పేరు తీసుకొస్తుంది.
Also Read : Kollywood : ఆలస్యంగా మేల్కొన్న విలక్షణ నటుడు.. ఆ దర్శకుడితో వర్కౌట్ అవుతుందా.?
సెంథిల్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాలో తీసిన కెమెరామెన్. అయితే ఒక కొత్త కుర్రోడుతో సినిమా చేస్తున్నప్పుడు కూడా అదే ప్యాషన్ తో వర్క్ చేశారు. రియల్లీ హాట్సాఫ్. పీటర్ మాస్టారు చాలా అద్భుతమైన యాక్షన్ కంపోజ్ చేశారు. మీరందరూ థియేటర్స్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. హాసిని వెల్కమ్ బ్యాక్. జెనీలియాని మళ్ళీ తెరపై చూడడం చాలా ఆనందంగా ఉంది. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్. వైరల్ సాంగ్ అదరగొట్టారు. కిరీటి చాలా పెద్ద స్టార్ అవుతాడు. ఇందులో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. మీరందరూ థ్రిల్ అవుతారు. అంత అద్భుతంగా యాక్షన్ పెర్ఫాం చేశాడు. డాన్సులు ఇరగదీసాడు, కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అల్లు అర్జున్ కి ఆర్య సినిమా ఎలాంటి విజయాన్ని అందించిందో కిరీటికి జూనియర్ సినిమా అలాంటి విజయాన్ని అందిస్తుందని అనుకుంటున్నాను. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని అన్నారు.
