Site icon NTV Telugu

‘ఎనిమి’ షూటింగ్ పూర్తి చేసిన ఆర్య

Arya Completes Enemy Shooting

తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎనిమి’. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్య విలన్ గా కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 23న ఆర్య ఈ చిత్రంలో తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేశాడని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చెన్నైలో నైట్ కర్ఫ్యూ ప్రారంభమయ్యే ముందు షూటింగ్ పూర్తి చేసి ఇంటికి పరిగెత్తుతున్నామని దర్శకుడు ఆనంద్ ట్వీట్ చేశారు. ఆయనకు ట్వీట్ కు స్పందించిన ఆర్య “మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మీ ఎనర్జీ, చిత్రీకరణ శైలి బాగుంది. త్వరలో మీతో కలిసి పని చేయాలని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఇక ‘ఎనిమి’ సెట్స్‌లో ఆర్య చివరి రోజున స్పెషల్ కేక్ ను కట్ చేశారు చిత్రబృందం. ఆ కేక్ లో ఆర్య ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను స్పెషల్ గా డిజైన్ చేశారు. కాగా ఎస్ వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో మమతా మోహన్‌దాస్, ప్రకాష్ రాజ్ కూడా నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version