Site icon NTV Telugu

ARYA -2 : ఆర్య 2 రీరిలీజ్.. సంధ్య థియేటర్ వద్ద భారీ పోలీస్ బందోబస్త్

Arya 2

Arya 2

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు  ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు.  2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్ఫటికి వినిపిస్తుంటాయి.

Also Read : Rabiya Khatoon : రబియా.. ఖాతూన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్

కాగా టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న అనగా నేడు ఆర్య 2 నేడు గ్రాండ్ గా రీరిలీజ్ అయిన నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్డ అలాగే సుదర్శన్ థియేటర్ వద్ద  పోలీసులు భారీ బందోబస్త్ నిర్వహించారు. టికెట్ లేనిది ఎవరిని థియేటర్ లోపలికి అనుమతించట్లేదు. ఎటువంటి డీజే సౌండ్స్ కానీ అనుమతించట్లేదు.  పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని  ఫ్యాన్స్ హంగామా చేసేందుకు పోలీసులు అనుమతించలేదని సమాచారం. ఇదిలా ఆర్య 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో సంధ్య 35mmలో కేవలం  2 నిమిషాలలోనే హౌస్ ఫుల్ కావడం విశేషం. ఇంత తక్కువ టైమ్ లో మొత్తం టికెట్స్ సోల్డ్ అవుట్ అయిన సినిమాగా ఆర్య 2 రికార్డ్ క్రియేట్ చేసింది.  మిగిలిన ఏరియాలలో డీజే సౌండ్స్ ఈలలు గోల మధ్య సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Exit mobile version