NTV Telugu Site icon

Arun Vijay : సంక్రాంతి రేస్ లో బాలా.. గట్టిగా కొట్టేలా ఉన్నాడే..?

Arun Vijay

Arun Vijay

యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి.తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో అచలుడు అనే చిత్రాన్ని ప్రారంభించాడు సూర్య . సగభాగం షూటింగ్ చేసాక సూర్య, బాలాకు మధ్య విభేదాల కారణంగా ఆ చిత్రాన్ని ఆపేస్తునట్టు ప్రకటించాడు.

Also Read : Dulquer Salmaan : లక్కీ భాస్కర్ రన్నింగ్ సూపర్..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా..?

అరుణ్ విజయ్ హీరోగా వణంగాన్‌ అనే చిత్రాన్నిమొదలెట్టాడు బాలా. వణంగాన్‌ చిత్రంలో అరుణ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. ఆ మధ్య విడుదల చేసిన వణంగాన్‌ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. బాలా ఈజ్ బ్యాక్ అని కకామెంట్స్ చేసారు. కన్యాకుమారి సముద్ర తీరంలోని తిరువళ్లువర్‌ విగ్రహ విశ్వరూప, ఓ చేతితో పెరియార్‌, మరో చేతిలో వినాయకుడితో అరుణ్‌ విజయ్‌ ని పరిచయం చేస్తూ బి బాలాఎదో చేస్తున్నాడు అనే ఆసక్తి రేకిత్తించాడు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం చిత్ర హీరో అరుణ్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. సముద్రఖని, రోషిని, దర్శకుడు మిస్కిన్  వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

Show comments