NTV Telugu Site icon

Arrsairaa : విడాకులపై రెహమాన్ స్పందన ఇదే

Arr

Arr

ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత  AR రెహమాన్, సతీమణి సైరా భాను విడిపోతున్నారు అనే వార్త సినీ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. 29 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకుంటున్నారు రెహమాన్ దంపతలు. AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు  ఆమె తరుపు న్యాయవాది  ప్రకటించారు. వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్న ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని కోరుతూ సైరా భాను పేర్కొంది.

Also Read : Darshi : విజయ్ దేవరకొండ చేతిలో ఆ హీరో జాతకం

తాజగా వీరి విడాకులపై ‘X’ వేదికగా AR రెహమాన్ స్పందిస్తూ ” ” తాము ఇద్దరం 30 ఏళ్ల వివాహిక జీవితంలో ఎంతో ఘనంగా అడుగుపెట్టి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తూ అది జరగలేదు. మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తలిచింది.  ఒక్కోసారి పగిలిన గుండెలను చూసి ఆ దేవుడు కూడా భయపడి ఉంటాడు. అలా విరిగిపోయిన ముక్కలు మళ్లీ ఎప్పటికి కలవవు.  ఈ కష్ట సమయంలో మాకు అండగా నిలిచిన స్నేహితులకు, బందువులకు అలాగే మా ఇరువురి  వ్యక్తిగత  ప్రైవసీని గౌరవిస్తున్న అందరికీ కృతజ్ఞతలు” అని రెహమాన్ ట్వీట్  చేసారు. కాగా రెహమాన్,సైరా భాను దంపతులకు ఖతీజా , రహీమా మరియు అమీన్  ముగ్గురు సంతానం. వీరిలో ఖతీజా AR రెహమాన్ సంగీతం అందించిన రోబో సినిమాతో గాయనిగా పరిచయం అయింది.

 

Show comments