Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Once More: విలక్షణమైన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్ ఈసారి సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా సీరియస్, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించిన ఆయన.. ‘వన్స్ మోర్’లో మాత్రం పూర్తి భిన్నమైన రొమాంటిక్ పాత్రలో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ తొలిసారి అర్జున్ దాస్‌తో జోడీ కట్టిన ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. రొమాన్స్, కామెడీ, ఎమోషన్‌తో పాటు మిస్టరీని కూడా పరిచయం చేస్తూ వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
విగ్నేష్ శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వన్స్ మోర్’ ఒక వైబ్రెంట్ తమిళ రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. ఇందులో అర్జున్ దాస్, అదితి శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ప్రేమలో విఫలమైన ఓ యువకుడి చుట్టూ ఈ మూవీ తిరిగేలా కనిపిస్తోంది. గతంలో ఎదురైన చేదు అనుభవం కారణంగా అతను ప్రేమపై నమ్మకం కోల్పోయి, జీవితాన్ని పెద్దగా పట్టించుకోకుండా తనదైన ప్రపంచంలో గడుపుతుంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి అదితి శంకర్ పోషించిన చలాకీగా ఉండే యువతి ప్రవేశిస్తుంది.
Also Read
ఆమె అతనికి దగ్గరవ్వడానికి చేసే ప్రయత్నాలు ట్రైలర్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఇద్దరి వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో వారి మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు మంచి కామెడీని తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అర్జున్ దాస్ సీరియస్‌గా ఉండే స్వభావానికి పూర్తి వ్యతిరేకంగా అదితి శంకర్ పాత్రను చాలా యాక్టివ్‌గా, అల్లరిగా చూపించారు. దీంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ‘వన్స్ మోర్’కు హైలెట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాకు సంగీతం కూడా హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. ‘హృదయం’, ‘ఖుషి’ వంటి సినిమాలతో తన మెలోడీ సంగీతంతో ఆకట్టుకున్న హిషామ్ అబ్దుల్ వహాబ్ ‘వన్స్ మోర్’కు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో పాటు, ట్రైలర్లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు యూత్‌ఫుల్ ఫీల్‌ను తీసుకొచ్చింది. ప్రేమ, కామెడీ, భావోద్వేగాలకు అనుగుణంగా సంగీతాన్ని ఉపయోగించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎమ్ఆర్పి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై యువరాజ్ రఘునాథన్, లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సోనా ఒలికల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ క్రేజీ లవ్ స్టోరీ తమిళ, తెలుగు భాషల్లోఆగస్టు 28న థియేటర్లలోకి రానుంది. అదే సమయంలో కవిన్, నయనతార నటించిన ‘హాయ్’ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారింది.
అర్జున్ దాస్ తన గంభీరమైన బేస్ వాయిస్, విలక్షణమైన నటనతో దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’ (కైతి) సినిమాలో అన్బు పాత్రతో కెరీర్ బ్రేక్ సాధించిన ఆయన, ఆ తర్వాత విజయ్ ‘మాస్టర్’, కమల్ హాసన్ ‘విక్రమ్’ వంటి భారీ చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించారు. కేవలం విలన్ పాత్రలకే పరిమితం కాకుండా ‘అంధగారం’, ‘బుట్టబొమ్మ’, ‘అనీతి’, ‘పోర్’ వంటి సినిమాల్లో హీరోగా వైవిధ్యమైన నటనను కనబరిచారు. పవన్ కళ్యాణ్ ‘OG’, అజిత్ ‘గుడ్ బాడ్ అగ్లీ’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ యాక్టర్‌గా రాణిస్తున్నారు.
మొత్తానికి ఇప్పటివరకు అర్జున్ దాస్‌ను చూసిన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ‘వన్స్ మోర్’లో ఆయనను రొమాంటిక్ హీరోగా చూపించడం సినిమాపై ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. అదితి శంకర్‌తో ఆయన కెమిస్ట్రీ, హిషామ్ సంగీతం, కామెడీతో పాటు కథలో దాగి ఉన్న మిస్టరీ సినిమాకు ప్లస్ పాయింట్లుగా కనిపిస్తున్నాయి. మరి ఈ కొత్త జోడీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఆగస్టు 28 వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!