Site icon NTV Telugu

Arjun Chakravarthy : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’..ఎక్కడ చూడాలంటే ?

Arjunchak

Arjunchak

థియేటర్లలో ఘన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. గతంలో ఆగస్టు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులు మరియు విమర్శకుల నుంచి విశేషమైన ప్రశంసలు అందుకుంది. ఇది కేవలం దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో ఏకంగా 46 ఫిల్మ్ అవార్డులను గెలుచుకొని సత్తా చాటింది.

Also Read : Nagula Chavithi 2025: నాగుల చవితి రోజు ఇలా చేస్తే.. మీకు పిల్లలు పుట్టడం ఖాయం..

క్రీడా నేపథ్యంలో బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే ప్రేమకథా అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీంతో ‘అర్జున్ చక్రవర్తి’ మొత్తం కుటుంబం కలిసి ఆనందంగా చూడదగిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ హిట్‌ను మిస్ అయిన వారు, అలాగే మరోసారి ఈ అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామాను ఆస్వాదించాలనుకునే వారు ఈ వీకెండ్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తప్పకుండా చూడవచ్చు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్.

Exit mobile version