Next Year Movies : 2027లో టాలీవుడ్‌లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..

Sprit, Dragon, Varanasi

Sprit, Dragon, Varanasi

టాలీవుడ్‌లో రీజనల్ మూవీస్ సత్తా చాటుతున్నాయి కానీ పాన్ ఇండియా సినిమాలకు గడ్డు కాలం ఎదురౌతోంది. పుష్ప2 తర్వాత ఏ మూవీ వెయ్యికోట్ల మార్క్ టచ్ చేయలేదు. 2025లో స్టార్స్ మిస్సయ్యారు.. 2026లో ఈ టార్గెట్ మిస్ ఫైర్ అవ్వదనుకుంటే రాజా సాబ్, పెద్ది చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమన్నాయి. ఫౌజీతో డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీస్ లెక్కలు సరిచేస్తాడనుకుంటే సినిమా నెక్ట్స్ ఇయర్‌కు పోస్ట్ పోన్ అవుతుందని టీఎఫ్ఐలో కొత్త చర్చ నడుస్తోంది.

ప్రభాస్ సినిమాలు చెప్పిన టైంకి రిలీజైన అవ్వడం లేదు . ఫౌజీ, స్పిరిట్‌లదీ అదే పరిస్థితి అట. ఫౌజీ వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతుందని టాక్. డిసెంబర్ 3 నుండి నెక్ట్స్ ఇయర్ సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. స్పిరిట్ రిలీజ్ డేట్ మార్చి5పై ఫౌజీ కర్చీఫ్ వేసినట్లు బజ్ స్పిరిట్ 2027 సెకండాఫ్‌లో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు రీజనల్ సినిమాకే పరిమితమైన మహేష్ బాబు రాజమౌళి వారణాసితో గ్లోబల్ టార్గెట్ చేస్తున్నాడు. 2027 ఏప్రిల్ 7 నుండి ఊచకోతకు సిద్ధమౌతుంది వారణాసి. ఈ ఏడాదే వస్తాడనుకున్న తారక్ కూడా నెక్ట్స్ ఇయర్‌కు వెళ్లిపోయాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ నెక్ట్స్ ఇయర్ జూన్ 11కి వాయిదా పడింది. షూటింగ్ డిలే ప్లస్ వర్త్ సినిమా ఇచ్చేందుకు ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

పుష్ప2 తర్వాత పూర్తిగా రాకాకు టైం కేటాయిస్తున్న అల్లు అర్జున్ కూడా టూ ఇయర్స్ బాక్సాఫీస్‌కు గ్యాప్ ఇచ్చాడు. నెక్ట్స్ ఇయరైనా రాకా వస్తుందా అంటే చెప్పలేమనే సమాధానం వినిపిస్తోంది. లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇక కల్కి2 సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు 10 రోజుల షూటింగ్ మాత్రమే కంప్లీటైందట. రామ్ చరణ్ అండ్ సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనే లేదు. ఈ చిత్రాలు ఎప్పుడొస్తాయో డిస్కర్షన్ అనవసరం. 2027 మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ ఇవ్వబోతుంది. ఈ హై ఆక్డేన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతాయోమో చూడాలి.