Site icon NTV Telugu

MEGA Release : బాబాయ్ – అబ్బాయ్ సినిమాలు రిలీజ్ డేట్స్ మారబోతున్నాయా?

Ustad Peddi

Ustad Peddi

బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ సినిమాల సీన్ రివర్స్ అయిందా అంటే, అవుననే మాట వినిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా  2026 మార్చి 27న రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇటీవల పెద్ది పోస్ట్ పోన్ కానుందనే వార్తలు వస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల మార్చి నుంచి ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాంతో ఇప్పుడు అబ్బాయ్ మిస్ చేసిన డేట్ కు బాబాయ్ రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

వరుస ప్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్నచిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’. మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కతుతున్న  ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్‌ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్నపెద్ది రిలీజ్ వాయిదా వేసే ఛాన్స్ ఉండడంతో ఆ ప్లేస్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ప్రకటించిన డేట్ కు రామ్ చరణ్ పెద్ది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా బాబాయ్ – అబ్బాయ్ లు జస్ట్ నెల గ్యాప్ లో మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సంక్రాంతికి మెగాస్టార్ వస్తుండగా మార్చి, ఏప్రిల్‌లో పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి.

Exit mobile version