Site icon NTV Telugu

రివేంజ్ లవ్ డ్రామా “అర్ధశతాబ్దం” ట్రైలర్

Ardha Shathabdham Trailer Out Now

కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అర్ధశతాబ్దం’. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది ఈ చిత్రం. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఒక మెయిన్ ఇష్యూను తీసుకుని, దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా ‘అర్ధశతాబ్దం’ను తెరకెక్కిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టార్స్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఈ చిత్రం టీజర్ ను సుకుమార్, ఫస్ట్ గ్లింప్స్ ను రానా దగ్గుబాటి, ‘ఏ కన్నులూ చూడనీ’ సాంగ్ ను రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు. నౌపాల్ రాజా సంగీతం అందించిన ఈ సాంగ్ ను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ‘ఆహా’లో జూన్ 11న ఈ చిత్రం ప్రసారం కానుంది. ఈ సాంగ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా ‘అర్ధశతాబ్దం’ ట్రైలర్ ను నాని విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లవ్ అండ్ రివెంజ్ డ్రామాలా కన్పిస్తోంది. మీరు కూడా ‘అర్ధశతాబ్దం’ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

Exit mobile version