Site icon NTV Telugu

AR Rehaman: షాకింగ్: విడాకులు ప్రకటించిన రెహమాన్ భార్య

ARRahman Divorce

ARRahman Divorce

సినీ పరిశ్రమ నుంచి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. “పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత, శ్రీమతి సైరా తన భర్త మిస్టర్ AR రెహమాన్ నుండి విడిపోవాలని కష్టమైన నిర్ణయం తీసుకుంది. వారి రిలేషన్ లో ముఖ్యమైన ఏమోషనల్ ప్రెసర్ తర్వాత ఈ నిర్ణయం తీసుకోబడింది. అని పేర్కొన్నాడు. ఒకరికొకరి మద్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట మధ్య ఏర్పడిన ఇబ్బందులు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని కనుగొన్నారనీ లాయర్ పేర్కొన్నారు.

Also Read: Game Changer: గట్టిగా పేలే సీక్వెన్స్ ప్లాన్ చేశారుగా!

ఈ సమయంలో ఎవరూ వారిని సముదాయించలేకపోయారు. శ్రీమతి సైరా ఎంతో బాధతో, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. శ్రీమతి సైరా తన జీవితంలోని ఈ కష్టమైన అధ్యాయాన్ని దాటినందుకు ప్రజల నుండి గోప్యత కావాలని కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు. 1995లో వివాహం చేసుకున్న రెహమాన్ సైరాలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఖతీజా, రహీమా అలాగే అమీన్ వీరి పిల్లలు. ఇక సినిమాల గురించి చెప్పాలంటే రెహమాన్ చివరిగా ధనుష్ రెండవ సారి దర్శకత్వం వహించిన రాయన్ సినిమాకి సంగీతం అందించాడు. త్వరలో రిలీజ్ కి రెడీగా ఉన్న ఛావా, థగ్ లైఫ్, గాంధీ టాక్స్ అలాగే అనేక భాషలలో అనేక చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version