Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!

Rahman Neww

Rahman Neww

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నుంచి ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అంచనాలను పెంచేసింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెద్ది కి ఆవాజ్’పేరిట బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ గ్రాండ్ వేడుకలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్, ఆయన బృందం లైవ్ పర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌ను దద్దరిల్లించగా, సినిమాలోని మోస్ట్ అవేటెడ్ థర్డ్ సింగిల్ ‘హల్లల్ల ల్లో’ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. వేలాదిగా తరలివచ్చిన జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్… మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ తన అద్భుతమైన కంటెంట్‌తో దేశమంతటా ప్రేక్షకులను అలరిస్తుండటం ఒక భారతీయుడిగా నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. గతంలో నేను సంగీతం అందించిన ఎన్నో తమిళ, హిందీ చిత్రాలు తెలుగులోకి డబ్ అయి విజయం సాధించాయి. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాపై అపారమైన ప్రేమ, ఆదరణ చూపిస్తూనే ఉన్నారు. అందుకే.. చాలా కాలంగా నేరుగా (స్ట్రెయిట్) ఒక తెలుగు సినిమాకు సంగీతం అందించాలని బలంగా అనుకుంటున్నాను. ‘పెద్ది’ రూపంలో నాకు ఆ పర్ఫెక్ట్ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది” అని తన ఆనందాన్ని పంచుకున్నారు. “దర్శకుడు బుచ్చిబాబు గారు నాకు ఈ కథను చెప్పినప్పుడు.. ఆ లైన్ మరియు ఆయనలో ఉన్న ప్యాషన్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే వెంటనే ఓకే చెప్పాను. ఇప్పటికే విడుదలైన పాటలన్నింటికీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్, గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌తో నా ట్యూన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. స్క్రీన్‌పై ఆయన చేసిన ప్రతి మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే జాన్వీ కపూర్ కూడా ఎంతో చక్కగా పెర్ఫార్మ్ చేసింది. ఈ ప్రేమాభిమానాలకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని ముగించారు.