Site icon NTV Telugu

AR Rahman : హైదరాబాద్‌లో రెహమాన్ కన్సర్ట్.. పాట వినాలంటే పర్సు ఖాళీ కావాల్సిందే!

Ar Rehman

Ar Rehman

తెలుగు రాష్ట్రాల్లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్‌కి డిమాండ్ బాగా పెరుగుతోంది. తమిళనాడు మాదిరిగా, ఇక్కడ కూడా దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకులు ఓవర్సీస్‌తో పాటు దేశంలోనూ పర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ ఈ ఏడాది నవంబర్ 8న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..

Also Read : Nagarjuna: ఆ హీరోయిన్‌ని క్షమాపణలు అడిగిన నాగార్జున..

ఈ ఈవెంట్‌కి టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకుడికి కాస్త కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే స్టాండింగ్ గోల్డ్ క్లాస్ టికెట్ ధర రూ.1800 కాగా, ప్లాటినం సీటు రూ.4000, MIP జంట టికెట్లు రూ.13,000, ఫేజ్ 3 లో కూర్చుని దగ్గరగా వీక్షించాలంటే రూ.24,000 చెల్లించాల్సిందే. ఫ్యాన్ పిట్ సెక్షన్‌లోకి వెళ్లాలంటే రూ.5,500 లేదా రూ.10,000 ఖర్చు చేయాల్సిందే. ఏ కోషన చూసుకున్న ఇది చాలా ఎక్స్‌పేన్సీవ్ అనే చెప్పాలి. ఇక ఈ మాదిరి రెట్లు ఉన్న ఈ ఈవెంట్‌కు.. మూడు నెలల ముందుగానే బుకింగ్స్ మొదలై భారీ స్పందన కనిపిస్తుంది. గతంలో హైదరాబాద్‌లో రెహమాన్ కన్సర్ట్ (సుమారు 7 ఏళ్ల క్రితం) లో ఇంత రేట్లు లేవని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. అయినా సరే, రెహమాన్ లైవ్‌లో పాడే పాటలు వినడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. అంతే కాదు ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ద’ సినిమా నుంచి ఎక్స్‌క్లూజివ్ సాంగ్‌ను పాడే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. రెహమాన్ మాజిక్‌క్కు మరోసారి ప్రత్యక్షంగా దొరికే అవకాశం వచ్చింది!

Exit mobile version