AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఆయన ఒక స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్‌ను ఒప్పుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భోపాల్ ఈవెంట్ సాక్షిగా రెహమాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సక్సెస్ చూశాకే తనకు తెలుగు సినిమాతో కలిసి ప్రయాణించాలనే బలమైన కోరిక కలిగిందని మనసులోని మాటను బయటపెట్టారు.
‘తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమా సాధించిన ఘన విజయం, సృష్టించిన ఇంపాక్ట్ చూసిన తర్వాత.. నేను కూడా ఖచ్చితంగా ఒక మంచి తెలుగు సినిమాకు పని చేయాలి, అక్కడి మేకర్స్‌తో కలిసి ప్రయాణించాలి అని బలంగా అనుకున్నాను. ఆ సమయంలోనే దర్శకుడు బుచ్చిబాబు సన ‘పెద్ది’ లాంటి ఒక అద్భుతమైన, ఎమోషనల్ రస్టిక్ కథతో నా ముందుకు వచ్చారు. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని రెహమాన్ చెప్పుకొచ్చారు. గతంలో తెలుగులో ‘నాని’, ‘కొమరం పులి’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రెహమాన్.. చాలా గ్యాప్ తర్వాత చరణ్ సినిమా కోసం ట్యూన్స్ కంపోజ్ చేశారు. నిన్నటి భోపాల్ ఈవెంట్లో ఈ సినిమా నుండి ఏకంగా రెండు పాటలను ఆయన తన టీమ్‌తో కలిసి స్టేజ్‌పై లైవ్‌లో పర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఊపేశారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?