Site icon NTV Telugu

AR Rahman: ‘అబ్బి అబ్బి..’ సంచలనం.. రెహమాన్ ను నమ్మొచ్చా?

Ar Rahman

Ar Rahman

ఒక పాట హిట్టయితే, ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా? ఈ ప్రశ్న ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఏఆర్ రెహమాన్. కొంతకాలంగా పూర్తిస్థాయి మ్యూజికల్ హిట్ ఆల్బమ్ ఇవ్వడంలో తడబడుతున్న రెహమాన్‌పై, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ద నమ్మకమే ఉంచారు. ఆ నమ్మకం ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్‌కు తెలుగులో ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. ఆయన సంగీతం అందించిన దాదాపు అన్ని తెలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నెగటివ్ సెంటిమెంట్‌ను పక్కనపెట్టి, బుచ్చిబాబు తన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’కి రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, తన ఎంపిక సరైనదేనని నిరూపించేలా రెహమాన్ ఇటీవల కాలంలో మంచి ఫామ్‌ను కనబరుస్తున్నారు.

Also Read :Keerthy Suresh: ఫైనల్లీ కీర్తికి తెలుగు సినిమా దొరికిందోచ్

ఇటీవల తమిళ చిత్రం ‘జీని’ నుండి విడుదలైన ‘అబ్బి అబ్బి..’ పాట సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ పాట, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా, ఈ పాటలో హీరోయిన్లు కృతిశెట్టి, కల్యాణి ప్రియదర్శన్ మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగే బెల్లీ డ్యాన్స్ పోటీ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మరోవైపు కమల్ హాసన్ ‘థగ్స్ లైఫ్’లో ‘జింగుచా..’ పాట హిట్టయినా, మిగతా పాటలు సోసోగానే ఉండటంతో, ఒకే పాట హిట్టయితే పూర్తి ఆల్బమ్‌పై నమ్మకం పెట్టుకోవచ్చా అనే సందేహాలు తలెత్తాయి. అయితే ‘అబ్బి అబ్బి’ పాట భారీ విజయం సాధించడంతో, రెహమాన్ మళ్లీ తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తున్నారని అభిమానులు నమ్ముతున్నారు. ఈ ఒక్క పాటతో దర్శకుడు బుచ్చిబాబు నమ్మకాన్ని రెహమాన్ నిలబెట్టారని చెప్పవచ్చు. ఈ తాజా హిట్‌తో ఇప్పుడు అందరి దృష్టీ ‘పెద్ది’ ఆల్బమ్‌పై పడింది. రెహమాన్ తన పూర్తిస్థాయి ఫామ్‌ను ఈ చిత్రంతో నిరూపించుకుంటారని, మెగా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version