Site icon NTV Telugu

Allu Arjun: అల్లు అర్జున్‌కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు

Allu Arjun Ap High Court

Allu Arjun Ap High Court

స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. అసలు విషయం ఏమిటంటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై ఒక కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ కేసును కొట్టేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి కలిసి పిటిష‌న్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్ శుక్రవారం నాడు విచార‌ణ‌కు రాగా ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసుల‌ను ఆదేశించింది. అలాగే ఈ కేసుకు సంబంధించి నవంబరు 6న తుది తీర్పు ఇవ్వ‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం వెల్లడించింది.

Jani Master: 36 రోజుల జైలు.. ఎట్టకేలకు బయటకొచ్చిన జానీ మాస్టర్

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బ్రేకులు పడే సమయానికి వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లి అభిమానులకు అభివాదాలు చేశారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రాగా పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేశారు. ఈ అంశంలోనే ఇప్పుడు హైకోర్టు అల్లు అర్జున్ కి గుడ్ న్యూస్ చెప్పింది.

Exit mobile version