Anushka : అనుష్క కోసం మూడు సార్లు లాఠీ చార్జ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఘాటి’ ఫుల్ ఆన్ కమర్షియల్ యాక్షన్ డ్రామా. అనుష్క గారి పెర్ఫార్మెన్స్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: నిర్మాత రాజీవ్ రెడ్డి
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత రాజీవ్ రెడ్డి విలేకరలు సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ఘాటీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ?
ఒక ఫిమేల్ సూపర్ స్టార్ తో కమర్షియల్ యాక్షన్ మూవీ చేయాలనేది మెయిన్ ఐడియా. కర్తవ్యం తర్వాత ఆ స్కేల్లో మళ్ళీ సినిమా రాలేదు. ఇప్పుడున్న స్టార్స్ లో అనుష్క గారికి అలాంటి స్టార్డం ఉంది. క్రిష్ గారు అనుష్క గారితో ఒక ప్రాజెక్టు చేయాలనుకున్నప్పుడు ఘాటి స్టార్ట్ అయింది. అరుకు, గాంజా బ్యాక్ డ్రాప్ లో ఒక కథ చేయాలనుకున్నాం. అయితే అది సినిమాగా చేయాలా వెబ్ సిరిస్ గా చేయాలని డిస్కషన్ వుండేది. ఫైనల్ గా అనుష్క గారితో సబ్జెక్టుని అనుకున్న తర్వాత మూవీ వర్క్ చేయడం మొదలుపెట్టాం.
ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఉందా?
-లేదండి. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ. దీనికి ఎలాంటి రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ లేదు. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్ లో ఎక్కువగా షూట్ చేశాం. ఒరిస్సాలో షూట్ చేసినప్పుడు అక్కడ లోకల్ పీపుల్స్ చాలా సపోర్ట్ చేశారు.
విక్రమ్ ప్రభు గారి ఛాయిస్ ఎవరిది?
క్రిష్ గారేదే. తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ప్లస్ అవుతుంది. ఆయన అద్భుతంగా పెర్ఫాం చేశారు.
అనుష్క గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ?
-టీజర్ ట్రైలర్ లో ఎంత ఇంటెన్సిటీ చూసారో సినిమాలో కూడా అంతే ఇంటెన్స్ గా ఉంటుంది. ఇది ఫుల్ యాక్షన్ సినిమా. క్రిష్ మార్క్ డ్రామా ఉంటుంది. అనుష్క గారి పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒరిస్సాలో ఒక బార్డర్ ఏరియాలో మేము షూట్ చేశాము. షూట్ కి వెళ్ళేటప్పుడు దాదాపు వేలాదిజనం అనుష్క చూడ్డానికి వచ్చేవారు. క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి రెండు మూడుసార్లు లాఠీ చార్జ్ కూడా అయింది. అనుష్క గారికి దేశవ్యాప్తంగా ఆ స్థాయి ప్రేక్షకాదరణ ఉంది. ఘాటిలో విజువల్స్ అవుట్ స్టాండింగ్ గా ఉంటాయి. ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఉంటుంది.
ఘాటికి పార్ట్ 2 వుందా?
ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. ఆడియన్స్ అందరూ కలిసి పెద్ద హిట్ చేస్తే అప్పుడు పార్ట్ 2 ఆలోచిస్తాం. అయితే ఈ కథకి పార్ట్ 2 చేసే స్కోప్ ఉంది.
క్రిష్ గారు అనుష్క గారు కాంబినేషన్లో వచ్చిన వేదం చాలా పెద్ద హిట్. మరి ఆ అంచనాల్ని ఘాటి అందుకుంటుందా?
-ఆ అంచనాలని అందుకోవాలని ఘాటిని తీసాం. కచ్చితంగా ఈ సినిమా దానికి రీచ్ అవుతుందనే నమ్మకం మాకుంది.
సినిమా ఫైనల్ అవుట్ చూసాక మీకు ఎలా అనిపించింది?
-మేం చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఏదైతే అనుకున్నామో అది స్క్రీన్ మీదకి అద్భుతంగా వచ్చింది.
సాగర్ మ్యూజిక్ గురించి?
-ఘాటి బ్యాగ్రౌండ్ స్కోరు చాలా అద్భుతంగా వచ్చింది. క్రిష్ గారు ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. మా సినిమాలన్నిటిలో పోస్ట్ ప్రొడక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఘాటి కూడా అద్భుతమైన స్కేల్లో ఉంటుంది.
వరుణ్ తేజ్ గారితో చేస్తున్న సినిమా గురించి?
దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ అయింది. అది చాలా మంచి హారర్ కామిడీ ఎంటర్టైనర్.
కొత్తగా చేస్తున్న వెబ్ కంటెంట్ గురించి?
-అరేబియన్ కడలి సీజన్ 2 స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే అమెజాన్ కి ఒక ఒరిజినల్ ఫిలిం చేయబోతున్నాం. ఇంకొన్ని స్క్రిప్స్ రెడీగా ఉన్నాయి. ఘాటీ రిలీజ్ తర్వాత వాటి అనౌన్స్మెంట్స్ వస్తాయి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!