టాలీవుడ్‌లో తనదైన శైలి, సంప్రదాయ నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. తొలి చిత్రంతోనే అందరి హృదయాలను గెలుచుకున్ని, ఆ తర్వాత మంచి అవకాశాలు అందుకొని.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే అనుష్క శెట్టి గురించి అభిమానులు కోరుకుంటున్నది ఒక్కటే. ఇప్పటికీ అనుష్క శెట్టి ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని సందేహిస్తున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తొలి ప్రేమ గురించి స్పందించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా వ్యక్తిగత విషయాల్లో నిమిత్తమాత్రంగా స్పందించే అనుష్క, ఈసారి తన ఫస్ట్ లవ్‌ను ఓ మధురానుభూతిగా అభివర్ణించింది.
Also Read : Dhanush : ధనుష్ ప్రాజెక్టు నుంచి పూజా హెగ్డే ఔట్..
అనుష్క మాట్లాడుతూ.. ‘నాకు ఆరో తరగతి చదువుతుండగా ఒక క్లాస్‌మేట్ నా దగ్గరికి వచ్చి ‘ఐ లవ్ యూ’ అన్నాడు. నాకు ఆ మాట అర్థమో తెలియదు కానీ, ఏదో మనసుకు బాగా నచ్చేసి..నేను అతనికి ‘ఓకే’ చెప్పేశాను. నిజంగా అది ఎంతో చిన్న విషయమే అయినా, నాకు ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలి పోయింది’ అని తెలిపింది. ఇలా ఓ స్టార్ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితంలోని చిల్డిష్ మూమెంట్‌ని ఈ విధంగా పంచుకోవడం అభిమానులకు సర్ప్రైజ్‌లా మారింది. దీంతో ఈ ఫస్ట్ లవ్ స్టోరీ పై సోషల్ మీడియాలో అభిమానులు పెద్దగా స్పందిస్తున్నారు.“అనుష్క ఫస్ట్ లవ్ గురించి చెప్పిన విధానం చక్కగా ఉంది”, “అనుష్కలోని అమాయకత్వం ఇప్పటికీ అలాగే ఉందని అర్థమవుతుంది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ప్రస్తుతం అనుష్క శెట్టి నటించిన ‘ఘాటీ’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఆమె భిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన అనుష్క, ఈసారి మరోసారి తాను ఎలా అలరిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
