NTV Telugu Site icon

“కూ”లోకి అడుగు పెట్టిన అనుష్క

Anushka

ట్విట్టర్ కు ప్రత్యామ్న్యాయంగా, దేశీయ ట్విట్టర్ గా పేరొందిన “కూ” యాప్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం సినీ స్టార్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకులు సైతం “కూ”పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే సామాన్యులతో పాటు చాలామంది ప్రముఖులు “కూ”లో చేరారు. తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా “కూ”లోకి ఎంట్రీ ఇచ్చారు. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘కూ’లోకి అడుగు పెట్టినట్లు అనుష్క ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. “హాయ్ ఆల్… మీరందరూ బాగున్నారని, సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం నా అధికారిక ‘కూ’ ఖాతాలో నన్ను ఫాలో అవ్వండి… ధన్యవాదాలు” అంటూ అనుష్క ట్వీట్ చేసింది.

Read Also : పొలిటికల్ సెటైర్ మూవీ ‘ఎల్కేజీ’ ట్రైలర్

ఇక “బాహుబలి”తో దేశవ్యాప్తంగా దేవసేనగా మంచి గుర్తింపు సంపాదించుకున్న స్వీటీ ఆ తరువాత రెండే చిత్రాల్లో నటించింది. ఒకటి ‘భాగమతి’ కాగా, రెండోది ‘సైలెన్స్’. ఈ రెండు చిత్రాలు కూడా విభిన్నమైన టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది అనుష్క. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. పి మహేష్ ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో అనుష్క ఎలాంటి పాత్రలో కన్పించనుందో చూడాలి.

https://twitter.com/MsAnushkaShetty/status/1407284789871140869