Site icon NTV Telugu

Anushka : హీరోయిన్ అనుష్క కొంటె చూపులు.. నగరంలో 40 యాక్సిడెంట్స్..?

Vedham Mve Anushka

Vedham Mve Anushka

టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనుష్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మామూలుగా ఒక హీరోయిన్ కెరీర్  మహా అయితే పదేళ్లు ఉంటుంది. గట్టిగా నిలుపుకుంటే మరో 5 ఏళ్లు వేసుకున్న 15 ఏళ్లు. కానీ.. అనుష్క మాత్రం దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంది. ఉండటమే కాదు.. ఇప్పటికీ అంతే క్రేజ్.సరిగ్గా 2005లో ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత మళ్లీ అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ల మీద హిట్లు కొడుతూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా పాత్రల విషయంలో హీరోయిన్ లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ అనుష్క త‌న కెరీర్‌లో కొన్ని రిస్కీ పాత్రలు కూడా చేసింది. అందులో ఆమె ‘వేదం’ చిత్రంలో చేసిన వేశ్య పాత్ర ఒక‌టి.

Also Read : Raviteja : రవితేజ, కిషోర్ తిరుమల మూవీ అఫిషియల్ అనౌన్స్‌మెంట్..

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ (జూన్ 04)కి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో రీసెంట్ ఈ మూవీ రిలీజ్ టైం లో జరిగిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే వేదం సినిమా ప్రమోష‌న్ కోసం అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ తెగ వాడేశారు. ప‌లు చోట్ల హోర్డింగ్ కూడా పెట్టారు. అయితే పంజాగుట్ట సర్కిల్ లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని చాలా పెద్దగా పెట్టార‌ట‌. అయితే అనుష్కని చూస్తూ వాహనదారులు యాక్సిడెంట్ల బారిన పడ‌డం అప్పట్లో చ‌ర్చనీయాంశం అయింది. దాదాపు 40 మైన‌ర్ యాక్సిడెంట్స్ జ‌ర‌గ‌డంతో పోలీసులు GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట. ప్రజంట్ ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version