Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran: పెళ్లిళ్లు, పిల్లల పెంపకంపై ఇటీవల సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్స్టాప్ పెట్టారు. ‘క్రేజీ కళ్యాణం’ సక్సెస్ మీట్ వేదికగా ఆమె మాట్లాడుతూ, తన మాటలను కొందరు సగం కట్ చేసి తప్పుగా వైరల్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. పెళ్లి వద్దని తాను ఎక్కడా అనలేదని, తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించారు. గతంలో సీనియర్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో “పెళ్లి కాకపోయినా పర్లేదు.. పిల్లల్ని మాత్రం కనండి” అన్న వ్యాఖ్యలపై మొన్నటి ప్రెస్ ఇంటర్వ్యూలో అనుపమను ప్రశ్న అడిగారు. దానికి ఆమె బదులిస్తూ పెళ్లి ప్రాధాన్యత గురించి మాట్లాడితే, కొందరు కేవలం సగం బిట్ మాత్రమే కట్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. దాంతో అనుపమ పెళ్లికి వ్యతిరేకమంటూ ప్రచారం మొదలైంది.
ఈ వివాదంపై వేదికపైనే ఉన్న నరేష్ పక్కనే కూర్చుని అనుపమ ఓపెన్‌గా మాట్లాడారు. “పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, పెళ్లి వద్దని నేను ఎక్కడా చెప్పలేదు. కానీ ఈ రోజుల్లో కేవలం పిల్లల కోసమే పెళ్లి చేసుకుని, ఆ తర్వాత సర్దుకుపోలేక విడాకులు తీసుకుంటున్న వాళ్లు చాలామంది ఉన్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు. పిల్లల్ని కనేముందు వాళ్లకు ఓ మంచి, సురక్షితమైన వాతావరణాన్ని ఇవ్వగలమా లేదా అన్నది ఆలోచించుకోవాలి. నా ఒపీనియన్ అదే తప్ప.. పెళ్లి చేసుకోకూడదని నేను ఎప్పుడూ అనలేదు” అని కుండబద్దలు కొట్టారు. దీనిపై నరేష్ కూడా స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా జనాభా తగ్గిపోతుండటం, లివ్-ఇన్ రిలేషన్లు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే పెళ్లి చేసుకున్నా, లివ్-ఇన్‌లో ఉన్నా పిల్లల్ని కని సృష్టిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని, తన మాటల్లో ఏమైనా తప్పుంటే క్షమించాలని పేర్కొన్నారు. మొత్తానికి అనుపమ ఇచ్చిన ఈ వివరణతో నెట్టింట నడుస్తున్న పెళ్లి వివాదానికి తెరపడింది.
Also Read
- Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
- Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
- Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
తాజావార్తలు
-
Anupama Parameswaran: పెళ్లి చేసుకోవద్దని నేను ఎక్కడా చెప్పలేదు: అనుపమ
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!