అనుపమ్ ఖేర్… ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ బాలీవుడ్ నటుడు. ఒకటి, రెండు కాదు 500 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. దేశ వ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్, హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించిన అనుపమ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. అలాంటి ఆయన తెలుగులో నేరుగా చేసిన మొదటి సినిమా కార్తికేయ 2 సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఆయన కృష్ణుడి ఎలివేషన్స్ బాగా వర్కౌట్ కావడంతో ఆయనకు చాలా తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఆయన మాత్రం టెంప్ట్ కాకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
NTRNeel: ఎన్టీఆర్ నీల్ సినిమా.. అంతా అవుట్ డోరే!
తాజాగా ఆయన మరో తెలుగు సినిమా ఒప్పుకున్నాడు. మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి దిగ్గజాలతో పాటు ప్రభాస్ నటిస్తున్న హను రాఘవపూడి ఫౌజీ సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు . కార్తికేయ 2 మరియు టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఇది ఖేర్ కి మూడవ తెలుగు చిత్రం అవుతుంది. ఫౌజీ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.