Anudeep to Direct Vishwaksen: పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడిగా మారిన కె.వి అనుదీప్ జాతిరత్నాలు అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కరోనా తగ్గుతుందన్న సమయంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఊపిరిలు ఊదింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం కాదు. ఇప్పటికీ ఒక మంచి కామెడీ సినిమాగా చాలా మందికి ఇష్టమైన సినిమాగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయలేదు. తన అసోసియేట్స్ కొందరు సినిమాలు చేస్తుంటే వాటికి సహాయం చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ల క్రితం రవితేజ హీరోగా అనుదీప్ ఒక సినిమా ఫైనల్ చేశాడు.
Anchor Rohini: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన తెలుగు యాంకర్.. ఏడుస్తున్న వీడియో వైరల్
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనుకోని కారణాల నేపథ్యంలో ఈ సినిమా ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక మరో స్క్రిప్ట్ తో అనుదీప్ విశ్వక్సేన్ ని పది రోజుల క్రితం కలిసి కథ నెరేట్ చేసినట్లుగా చెబుతున్నారు. విశ్వక్సేన్ కి కథ నచ్చడంతో అక్టోబర్ నుంచి సినిమాని పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ సంస్థ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే రవితేజ సినిమా పూర్తిగా పక్కన పెట్టేశారా లేక ఈ సినిమా పూర్తయిన తర్వాత చేస్తారా అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే జరుగుతున్న ప్రచారం మేరకు అయితే రవితేజ సినిమా ఇక ఆపేసినట్లే అని చెబుతున్నారు. అయితే దానికి సంబంధించిన కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.