Site icon NTV Telugu

Raj tarun : మాల్వీ మల్హోత్రా నిజస్వరూపం బయటపెట్టే మరోక వీడియో…ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..?

Untitled Design (2)

Untitled Design (2)

రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్యల ఎపిసోడ్ డైలీ సీరియల్ లా జరుగుతూనే ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను వాడుకొని వదిలేసాడనేది లావణ్య ఆరోపణ.

కాగా లావణ్య తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ, తన అన్నయ్యను వేధిస్తోందని హీరోయిన్ మాల్వి మల్హోత్ర ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు పోలీసులు విచారణ దశలో ఉండగా తాజాగా మరో కోణం వెలుగు చూసింది. హీరో రాజ్ తరుణ్-లావణ్య-మాల్వి మల్హోత్రా కేసులో ముంబైకు చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేశ్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. ప్రేమ పేరుతో తన కుమారుడిని మాల్వి మల్హోత్రా వంచించిందని, ఆస్తులు లాక్కొని తమను రోడ్డున పడేసిందని ఆరోపించింది యోగేశ్ తల్లి. అంతేకాదు ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని తన కుమారుడిపై కేసు పెట్టి జైలుకు పంపిందని కంటతడి పెట్టుకుంది. యోగేష్, మాల్వి మల్హోత్రా కలిసి తిరిగిన ఫ్లైట్‌ టికెట్స్, ఇద్దరి మధ్య జరిగిన వాట్సప్ చాట్స్, వ్యక్తిగత ఫోటోలను బయటపెడుతూ వీడియో రిలీజ్ చేసింది. తమ కుమారుడు నాలుగేళ్లుగా జైల్లో ఉన్నాడని రోదిస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్ యోగేశ్ తల్లి. రానున్న రోజుల్లో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల కేసులో ఇంకెన్ని ట్విస్ట్ లు ఇంకెన్ని మలుపులు ఉంటాయో చూడాలి.

Also Read: Priya darshi: హాస్యనటుడి నుండి అందరూ మెచ్చే హీరోగా మారిన దర్శి..!

Exit mobile version