Site icon NTV Telugu

టాలీవుడ్ ఎంట్రీకి మరో తమిళ హీరో సిద్ధం

Another Tamil star to make Tollywood debut

తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే తలపతి విజయ్, ధనుష్ ఇద్దరూ అధికారికంగా తమ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలను ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మితం కానుంది. అయితే ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి బాటలోనే నడుస్తున్నాడు మరో తమిళ హీరో శివ కార్తికేయన్. ఆయనకు కోలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ శివకార్తికేయన్ నటించిన కొన్ని సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేశారు. కానీ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించడం మాత్రం ఇదే మొదటిసారి.

Read Also : రజినీకాంత్ షాకింగ్ నిర్ణయం… ఇకపై నో పాలిటిక్స్… !

ఫస్ట్ తెలుగు మూవీకి ఈ యంగ్ హీరో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా రానుంది అంటున్నారు. విజయ్, ధనుష్ లకు ఇప్పటికే టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే శివకార్తికేయన్ కు మాత్రం ఆ రేంజ్ లో లేదనే చెప్పాలి. మరి ఈ హీరో మొదటి తెలుగు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన పొందుతాడో చూడాలి.

Exit mobile version