NTV Telugu Site icon

Prabhas : ‘ఫౌజీ’లో మరో హీరోయిన్.. ?

Fouji

Fouji

టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రంలో ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్, లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్‌గా ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే హను రాఘవపూడి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.

Also Read: Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ

ఏంటి అంటే..‘ఫౌజీ’ లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని, పైగా ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే ఓ వార్త ప్రచారంలోకి రాగా. ఇప్పుడు ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం సెకండ్ హాఫ్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అని.. ఇప్పుడు ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ను తీసుకోబోతున్నట్లు టాక్ వినపడుతుంది. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.