Site icon NTV Telugu

LCU : లోకేష్ కానగరాజ్ యూనివర్స్‌లో మరొక స్టార్ హీరో..

Benz

Benz

లోకేష్ కనగరాజ్ సినీమా ప్రేక్షకులకు అంతగా పరిచయం చేయనవసరం లేని పేరు. తన సినిమాటిక్ మ్యాజిక్ తో, దర్శకత్వ ప్రతిభతో బ్లాక్ బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.తోలి సినిమా నుండి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు లోకేష్. కార్తి హీరోగా వచ్చిన ఖైదీ చిత్రంతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసాడు. లోకనాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమాను ఖైదీ సినిమాతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్సల్ కొనసాగించాడు. విజయ్ హీరోగా వచ్చిన లీవో చిత్రంతో లియో చిత్రంతో ఖైదీ, విక్రమ్ సినిమాలను లింక్ చేస్తూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూ చేసాడు.

Also Read : Shocking : కంగువ ఎడిటర్ హఠాన్మరణం..

తాజాగా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో మరో హీరో వచ్చి చేరాడు. కాంచన సిరీస్ తో అలరించిన రాఘవ లారెన్స్ హీరోగా ‘బెంజ్’ అనే సినిమాను ప్రకటించాడు లోకేష్. ఈ సినిమాకు కథ లోకేష్ కనకరాజు అందించాడు. కారణంతో పోరాడే యోధుడు సైనికుడికంటే ఎక్కవు ప్రమాదకరం. వెల్కమ్ టు మై సినిమాటిక్ యూనివర్స్ మాస్టర్ అంటూ అధికారకంగా వీడియో రిలీజ్ చేశారు. లారెన్స్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ చుస్తే ‘బెంజ్’ సినిమా కథకు లోకేష్ గత చిత్రాలకు లింక్ ఉండేలాగా హింట్ ఇచ్చాడు. అత్యంత భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. లోకేష్ కనగరాజ్ నిర్మించే ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించమన్నాడు.

Exit mobile version