NTV Telugu Site icon

Anee master : జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను..

Aanee Master

Aanee Master

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. తాజాగా ఈ కేసు వ్యవహారంపై జానీ మాస్టర్ కి మద్దతుగా ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పందించారు.

ఆనీ మాస్టర్  మాట్లాడుతూ ” జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను, వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నాను. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చా.జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం బాధాకరం.నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు.కనీసం హోల్డ్ లో పెట్టాల్సింది జానీ మాస్టర్ దగ్గర నేను రెండేళ్లు వర్క్ చేశాను. ఇతర దేశాలు కూడా వెళ్ళాము.ఎప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి. అప్పట్లో జానీ మాస్టర్ మంచివాడు.. గొప్ప వ్యక్తి అని మీడియా ముందు చెప్పిన ఆ అమ్మాయి ఇప్పడు అదే జానీ మాస్టర్ పై కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఎవరికైనా సమస్య అని తెలియగానే సహాయం చేసే వ్యక్తుల్లో జానీ ముందుంటారు. ఈరోజు అమ్మాయి విషయం అనే ఒక్క కారణం తో.. ఎవరూ స్పందించడం లేదు. నేను ఇప్పటివరకు ఎవరి నుంచీ ఎలాంటి వేధింపులు ఎదుర్కోలేదు..అసలు వేధింపులు అనేవి ఉండవు. కొరియోగ్రఫీ అసోసియేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వేధింపుల విషయాన్ని ఉపేక్షించదు” అని అన్నారు.

Show comments