Site icon NTV Telugu

Karthi : అన్నగారు వస్తారు.. రిలీజ్ పై తర్జన భర్జన

Karthi

Karthi

టాలీవుడ్ ఆడియన్స్‌కు సిన్సీయర్‌గా దగ్గరయ్యేందుకు ప్రయత్నించే ఏకైక కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. తొలి నుండి తన సినిమాలను తెలుగులో తీసుకు వచ్చేటప్పుడు ఇక్కడి నేటివిటీకి తగ్గట్లుగా మార్చేస్తుంటాడు. కొన్నిసార్లు తన చేతుల్లో నేమ్ ఛేంజ్ చేసే ఛాన్స్ లేకపోతే తప్ప ఆల్మోస్ట్ కార్తీ సినిమాలన్నీ తెలుగు టైటిల్స్‌ తో వచ్చినవే. నెక్ట్స్ కూడా వా వాతియార్‌ను అచ్చమైన తెలుగు టైటిల్‌ ‘అన్నగారు వస్తారు’గా తీసుకొస్తున్నాడు.

Also Read : Venky 77 : వెంకీ – త్రివిక్రమ్ రెగ్యులర్ షూటింగ్ కు డేట్ ఫిక్స్

వా వాతియార్‌ను గతంలో డిసెంబర్ 5న తీసుకు వస్తున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు డిలే అవుతున్నట్లు టాక్. అందుకు దర్శకుడు నలన్ కుమార స్వామి ఒక కారణం కాగా రెండవ కారణం నిర్మాత జ్ఞానవేల్ రాజా అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డీలే కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ చేద్దామనుకునే లోగా ఈ సినిమాకు మరో చిక్కొచ్చింది. అన్నగారు వస్తారు డిజిటల్ అండ్ శాటిలైజ్ రైట్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. నిర్మాత జ్ఞానవేల్ రాజా అడుగుతున్న రేట్ కు డిజిటల్ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయట. జ్ఞానవేల్ రాజా బ్యానర్ స్టూడియో గ్రీన్ పై వచ్చిన గత చిత్రం కంగువ భారీ ప్లాప్ అయింది. ఈ  క్రమంలోనే ఇప్పడు రాబోతున్న వా వాతియార్ పై ఆ ప్లాప్ ప్రభావం పడింది. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతోన్న వా వాతియార్‌లో పోలీసాఫీసర్‌గా కనిపించబోతున్నాడు కార్తీ. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే అన్నగారు డిసెంబరు 12న వస్తారని సమాచారం. లేదా క్రిస్మస్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Exit mobile version