NTV Telugu Site icon

Anjali : సౌత్ సినిమాలతోనే నెట్టుకొస్తున్న అంజలి

Anjali

Anjali

ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నా అంజలి విషయంలో సక్సెస్ దోబూచులాడుతోంది. ఒక్క మూవీ హిట్టు పడేలోపు వరుస ప్లాపులు పలకరిస్తున్నాయి. లేడీ ఓరియెంట్ సిరీస్, వెబ్ సిరీస్ చేస్తోన్న వర్కౌట్ కావట్లేదు. తన కో స్టార్స్ నయనతార, త్రిష, సామ్, రకుల్ లాంటి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న భామలంతా బాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే ఈ తెలుగు అమ్మాయి మాత్రం కేవలం సౌత్ సినిమాలతోనే  నెట్టుకొస్తుంది.

Also Read : Tollywood Rewind 2024 : దర్శక నిర్మాతలకు దీపావళి సినిమాలు నేర్పిన పాఠం

ఈ ఏడాది గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్ ఆఫ్ గోదావరి, బహిష్కరణ వెబ్ సిరీస్‌‌తో పలకరించింది అంజలి. కానీ ఆ సినిమాలేవీ ఆమె గ్రాఫ్ పెంచలేకపోయాయి. ఇప్పుడు ఆమె హోప్స్ అన్నీ రామ్ చరణ్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్‌పైనే. శంకర్- చెర్రీ కాంబోలో వస్తోన్న గేమ్ ఛేంజర్ నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి బరిలో దిగనుంది. ఇందులో అప్పన్న భార్యగా కనిపించబోతుంది అంజలి. ఈ సినిమా తనకు సౌత్‌ లోనే కాదు నార్త్‌లో కూడా మంచి గుర్తింపు దక్కుతుందని భావిస్తుంది. ప్రజెంట్ ఆమె చేతిలో కేవలం రెండు తమిళ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఈగై, పూచండి లాంటి లేడీ ఓరియెంట్ చిత్రాలు చేస్తుంది. ఈ రెండు కూడా నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కాబోతున్నాయి. తెలుగులో కొత్త సినిమాలేమీ ఒప్పుకోలేదు. క్యారెక్టర్ కొత్తగా ఉంటేనే ట్రై చేయాలని అనుకుంటున్నట్లు టాక్. గేమ్ ఛేంజర్. ఈమె కెరీర్ ఏమన్నా ఛేంజ్ చేస్తుందా, అంజలీని మళ్లీ ఫామ్‌లోకి తీసుకువచ్చి బాలీవుడ్ వైపు అడుగులు వేయిస్తుందేమో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే