Site icon NTV Telugu

Anitha Chowdary: ‘సూరీడు’ తల్లి కొత్త బిజినెస్ పెట్టిందోచ్!

Anitha Chow

Anitha Chow

ఛత్రపతి సినిమాలో సూరీడూ అంటూ తన కొడుకును వెతికే గుడ్డి తల్లి పాత్ర తెలియని తెలుగువారుండరు. అలాంటి నటి
హిట్ సినిమాలు, టీవీ షోలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న స్టార్ యాంకర్ అనితా చౌదరి ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్‌లోకి స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చారు! హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో “మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్”ని ఓపెన్ చేశారు. ఈ కేఫేని యంగ్ హీరో నిఖిల్ లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్‌కి మ్యూజిక్ మాస్టర్ కల్యాణి మాలిక్, నటుడు ఉత్తేజ్, నటి శ్రీలక్ష్మి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దాము, ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్, రైటర్ బీవీఎస్ఎన్ రవి, నటుడు రఘుబాబు, డైరెక్టర్ నందినీ రెడ్డి లాంటి సినీ బిగ్‌షాట్స్ హాజరై మద్దతు తెలిపారు.

Akkineni Heroes : మారిన అక్కినేని హీరోలు.. రొటీన్ లవ్ స్టోరీలకు గుడ్ బై..

ఈ సందర్భంగా అనితా చౌదరి మాట్లాడుతూ నటిగా, యాంకర్‌గా మీ అందరి లవ్ పొందడం టోటల్‌గా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్’ని స్టార్ట్ చేశా. అసలు ఈ కేఫే ఐడియా నా బకెట్ లిస్ట్‌లో టాప్‌లో ఉండేది! హీరో నిఖిల్ తన సూపర్ బిజీ షెడ్యూల్‌ని సైడ్ చేసి, మా కోసం టైమ్ కేటాయించి లాంఛ్ చేయడం టోటల్‌గా హార్ట్ టచింగ్. ఇండస్ట్రీ నుంచి నా ఫ్రెండ్స్, సినీ స్టార్స్ ఇలా ఎంతోమంది సపోర్ట్‌ చేస్తూ ఇక్కడికి రావడం నన్ను ఫుల్ ఖుషీ చేసింది.

Exit mobile version