Jonita Gandhi Attends Anirudh-Kavya Maran Reception: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సీఈవో కావ్య మారన్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట నవంబర్ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
కావ్య, అనిరుధ్ రిసెప్షన్‌కు ప్రముఖ నేపథ్య గాయని జొనితా గాంధీ కూడా హాజరయ్యారు. అంతేకాదు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. గతంలో అనిరుధ్, జొనితా గాంధీ మధ్య ప్రేమాయణం ఉందంటూ పలుమార్లు వార్తలు, వదంతులు వచ్చాయి. తాజాగా అనిరుధ్ పెళ్లి వేడుకలో జొనితా కనిపించడంతో నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘మాజీ ప్రేయసిని రిసెప్షన్‌కు పిలిచాడు.. ఎంత మంది ఉంటారు ఇలా. అనిరుధ్ సర్ గ్రేట్’ అంటూ అనిరుధ్‌ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. జొనితా హాజరుకావడాన్ని వ్యక్తిగత సంబంధాల కోణంలో చూడాల్సిన అవసరం లేదని.. వారిద్దరూ సంగీత రంగంలో కలిసి పనిచేసిన స్నేహితులు, సహచర కళాకారులని పలువురు గుర్తుచేస్తున్నారు.
అనిరుధ్ సంగీత దర్శకత్వంలో జొనితా గాంధీ పాడిన పలు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమాలోని ‘అరబిక్ కుత్తు (హలమితి హబీబో)’ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ సినిమాలోని ‘చెల్లమ్మ’ పాట కూడా యువతను ఉర్రూతలూగించింది. ఇక ‘డాన్’ సినిమాలోని ‘ప్రైవేట్ పార్టీ’ పాటతో ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ఒరే ఒరు’ వంటి మెలోడీ పాటల్లోనూ వీరిద్దరి కలయిక సంగీత ప్రియులను అలరించింది. ఈ హిట్ సాంగ్స్ కారణంగా అనిరుధ్, జొనితా మధ్య మంచి ప్రొఫెషనల్ అనుబంధం ఏర్పడింది. మొత్తానికి కావ్య, అనిరుధ్ వివాహ రిసెప్షన్లో జొనితా ఫొటో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు కారణమైంది.

