Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anirudh Ravichander: సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే, తాము ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మొదటి అవకాశం ఇచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోరు. కానీ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ మాత్రం ఆ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టేశాడా? అంటే అవుననే అంటున్నారు ధనుష్ అభిమానులు. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఒక నోట్ ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. సంగీత దర్శకుడిగా తన ప్రయాణం మొదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీసెంట్గా అనిరుధ్ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. తన తొలి పాట విడుదలైన నాటి నుంచి నేటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పనిచేయడం, స్టేడియం షోలు, ‘జైలర్ 2’, ‘ప్యారడైజ్’ వంటి రాబోయే సినిమాల గురించి ఎంతో గొప్పగా రాసుకొచ్చాడు. అంతేకాదు, దేశంలోని అగ్ర దర్శకులు, స్టార్స్, నిర్మాతలతో పనిచేసే అదృష్టం దక్కిందని ఆ నోట్లో పేర్కొన్నాడు.
అనిరుధ్ రాసిన ఇంత పెద్ద లేఖలో ఎక్కడా హీరో ధనుష్ పేరు కనిపించకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. 15 ఏళ్ల క్రితం అసలు అనిరుధ్ ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. అలాంటి సమయంలో అతనిలోని ప్రతిభను గుర్తించి, ‘3’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మొదటి ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇచ్చింది ధనుష్. ‘వై దిస్ కొలవెరి డి’ పాటతో అనిరుధ్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడానికి ప్రధాన కారణం ధనుష్. అలాంటిది, తన 15 ఏళ్ల సక్సెస్ జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ రాసిన నోట్లో కనీసం ధనుష్ ప్రస్తావన కూడా లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రీసెంట్గా నవంబర్ 11న జరిగిన అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లికి సైతం ధనుష్‌కు ఆహ్వానం అందలేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత విభేదాల వల్ల పెళ్లికి పిలవకపోయినా సరే అనుకోవచ్చు.. కానీ కెరీర్‌కు పునాది వేసిన వ్యక్తి పట్ల కనీసం కృతజ్ఞత చూపించకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “ఎంత ఎత్తుకు ఎదిగినా.. నీ ఎదుగుదలకు కారణమైన వాడిని, కష్టకాలంలో తోడ్పాటు అందించిన వాడికి కనీసం కృతజ్ఞత చెప్పకపోవడం కంటే పెద్ద విజ్ఞత లేని పని ఇంకోటి ఉండదు” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read
- Sita in Ramayana: సీత యోధురాలే.. ఆ సాక్ష్యంతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్ నితీష్ తివారి..!
- Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
- Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
- Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో, గతంలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య (ధనుష్ మాజీ భార్య) అనిరుధ్‌కు ‘3’ సినిమాలో అవకాశం రావడం గురించి మాట్లాడిన పాత వీడియోను ఫ్యాన్స్ మళ్ళీ బయటకు తీసి షేర్ చేస్తున్నారు. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా కలిసి తిరిగిన ధనుష్ – అనిరుధ్ మధ్య దూరం ఇంతలా పెరిగిపోయిందా అని కోలీవుడ్ వర్గాలు సైతం చర్చించుకుంటున్నాయి. మరి ఈ ట్రోలింగ్‌పై అనిరుధ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Anirudh Ravichander: లైఫ్ ఇచ్చిన ధనుష్‌నే మర్చిపోయావా అనిరుధ్? 15 ఏళ్ల నోట్‌పై ఫ్యాన్స్ ఫైర్!
-
Rachin Ravindra: టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోయాం.. టెస్టులో అలా ఉండదు.. భారత్‌ను దెబ్బ కొడతాం..
-
Airport Security: ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నుంచి CISF సిబ్బంది తగ్గింపు.. వారి స్థానంలో..
-
MS Dhoni: IPLకు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. గురువుగా సరికొత్త అవతారం..
-
GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..