Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2”..బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.దర్శకుడు సుకుమార్ పుష్ప 2 సినిమాను మరింత భారీగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె వీడియో,పోస్టర్స్,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.’పుష్ప పుష్ప’ అంటూ సాగే ఈ సాంగ్ రికార్డు వ్యూస్ తో అదరగొడుతుంది.
Read Also :Game Changer : శంకర్ మార్క్ ఫిల్మ్ గా ‘గేమ్ చేంజర్’.. థమన్ కామెంట్స్ వైరల్..
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు.కపుల్ సాంగ్ గా రానున్న ఈ సాంగ్ ను “మే 29 ” ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.అయితే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఊ అంటావా మావా అంటూ సమంత వేసిన స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే పుష్ప 2 సినిమాలో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.తాజాగా యానిమల్ బ్యూటీ ‘తృప్తి డిమ్రి ‘ పేరు వినిపిస్తుంది.యానిమల్ సినిమాతో స్టార్ గా మారిన ఈ భామకు వరుస అవకాశాలు వస్తున్నాయి.తాజాగా ఈ భామకు ఈ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.
