ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ నెల 13న వైద్య పరీక్షలు చేయించుకోగా కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా మేరకు అనిల్ హోమ్ ఐసొలేషన్ లో ఉన్నారు. కరోనా కు తగిన చికిత్సను తీసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని, ఈ రోజు కరోనా పరీక్ష చేయించుకోగా రిపోర్ట్ నెగెటివ్ వచ్చిందని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం విషయమై ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు. అయితే… తమని తాము కరోనా నుండి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
కొవిడ్ నుండి బయటపడ్డ అనిల్ రావిపూడి!
