Site icon NTV Telugu

Anil Ravipudi: ఒక్కసారిగా దాడి చేసి వెళ్లిపోతారు.. రాజమౌళిపై అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు!

Anil Ravipudi

Anil Ravipudi

సెట్లోకి అడుగుపెట్టిన మొదటి డే గుర్తొస్తే గనుక వన్ పర్సెంట్ కూడా బెరుకు లేదు, భయం లేదని.. ఆ తర్వాత నుంచే భయం, బెరుకు స్టార్ట్ అయిందని స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. మన స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన రీజినల్ మూవీస్ పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయని.. ఇప్పుడు వారు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారని ప్రశంసించారు. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు తన సినిమాలతో ఒక్కసారిగా దాడి చేసి వెళిపోతారని, 2-3 ఏళ్లకు సరిపడా ఒక్కసారే దాడి చేస్తారని అనిల్ చెప్పుకొచ్చారు.

Also Read: Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?

సంక్రాంతి పండగ వచ్చిందంటే.. పిల్లల బట్టలకి ఇంత, మన బట్టలకి ఇంత, అనిల్ రావిపూడి సినిమా చూడ్డానికి ఇంత బడ్జెట్ అని జనాలు లెక్కలు వేసుకుంటున్నారనే వ్యాఖ్యలకు అనిల్ రావిపూడి హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాలీవుడ్‌కు ఎందుకు వెళ్లలేదు?, ఎందుకు ఎన్టీఆర్‌తో ఇంకా ఎందుకు సినిమా తీయలేదు, భగవంత కేసరికి వచ్చిన నేషనల్ అవార్డు తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చింది?, సూపర్ స్టార్ రజనీకాంత్‌పై తన వివరణ ఏంటి? అనే పలు ప్రశ్నలకు అనిల్ రావిపూడి సమాధానాలు ఇచ్చారు. పూర్తి వీడియో జనవరి 26 సాయంత్రం 7 గంటలకు ఎన్టీవీ తెలుగులో అందుబాటులో ఉంటుంది. అనిల్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

Exit mobile version