ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జత కడుతూ వరుస సినిమాలతో ధూసుకుపొతుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అందులో ‘పరమ్ సుందరి’ కూడా ఒక్కటి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోగా. దీనిపై కేరళకు చెందిన పలువురు నటీనటులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అచ్చ మలయాళ అమ్మాయిగా జాన్వీ కపూర్ పాత్ర ఉంది. ఇదే మలయాళీను ఎక్కువగా అభ్యంతరానికి గురి చేసిన విషయం.. అందులో జాన్వీ కపూర్ యాసపై మలయాళీల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పలువురు నటీనటులు ఓపెన్‌గా జాన్వీ కపూర్‌ను తప్పుబట్టారు..
ఓ నార్త్‌కు చెందిన అమ్మయిని మళయాల యువతిగా చూపించడాన్ని మలయాళ నటి, గాయని పవిత్ర మీనన్‌తోపాటు కంటెంట్ క్రియేటర్ స్టెఫీ తప్పుబట్టారు. కేరళ చిత్రసీమలో హీరోయిన్లు, నటీమణులు లేరా.. బాలీవుడ్ హీరోయిన్‌ను బలవంతంగా మలయాళీగా చూపిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. అయితే ఈ విషయంపై తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ గట్టి కౌంటర్ ఇచ్చింది.. ‘ మీరు అన్న మాట నిజమే.. అవును నేను మలయాళ అమ్మాయిని కాదు. మా అమ్మ కూడా మలయాళీ కాదు. కానీ కేరళ సంస్కృతి పట్ల నేనెప్పుడూ గౌరవంతో ఉంటాను. ముఖ్యంగా మలయాళ సినిమాకు నేను పెద్ద అభిమానిని. ‘పరమ్ సుందరి’లో కేరళ అమ్మాయిగానే కాదు తమిళ అమ్మాయిగానూ కనిపిస్తా. ఇది ఒక వినోదాత్మక కథ కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చింది.
