Site icon NTV Telugu

Tollywood : టాలీవుడ్ డెబ్యూతోనే గట్టిగా సౌండ్ చేయబోతున్న అనశ్వర రాజన్

Bollywood

Bollywood

టీనేజ్ వయస్సులోనే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన అనశ్వర డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటిస్తోంది.

Also Read : Gujju Wood : బడ్జెట్ రూ. 50 లక్షలు.. కలెక్షన్స్ రూ.75 కోట్లతో అబ్బుర పరుస్తున్న గుజరాతీ మూవీస్..

అనశ్వర రాజన్ టాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయ్యింది. అచ్చమైన తెలుగు సినిమాతో డెబ్యూ ఇవ్వబోతోంది. రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఫిల్మ్ ఛాంపియన్. ఈ స్పోర్ట్స్ డ్రామాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి చంద్రకళగా పరిచయం కాబోతోంది అనశ్వర రాజన్. ఈ సినిమా లో అనశ్వర పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతోంది. ఛాంపియన్ మూవీని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ మధ్య మాలీవుడ్‌లో బిజీగా ఉండి కోలీవుడ్‌లో కాన్సట్రేషన్ తగ్గించిన ఈ సూపర్ శరణ్య.. మళ్లీ తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్ హీరోగా.. సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా తెరకెక్కిస్తోన్న విత్ లవ్‌లో అనశ్వర హీరోయిన్. ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే 7/జీ రెయిన్ బో కాలనీ2లో నటిస్తోంది. దీన్ని తెలుగులో కూడా 7/జీ బృందావన్ కాలనీ2గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ ఏడాది అప్పుడే మలయాళంలో ఐదు సినిమాలు దింపేసిన ఈ క్యూటీకి ఛాంపియన్ స్పెషల్ మూవీ. ఈ సినిమాతో అనశ్వర తెలుగు ప్రేక్షకుల మదిలో ఛాంపియన్‌గా నిలబడుతుందో లేదో చూడాలి.

Exit mobile version