NTV Telugu Site icon

Anchor Rohini: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన తెలుగు యాంకర్.. ఏడుస్తున్న వీడియో వైరల్

Rohini Arrested

Rohini Arrested

Anchor Rohini Arrested in a Rave Party: ఈ మధ్యకాలంలో రేవ్ పార్టీల వ్యవహారం ఎంత పెద్ద కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు శివార్లలో జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమతో పాటు కొంతమంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఉన్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలకలం రేగింది. ఏకంగా హేమను అరెస్ట్ చేయడమే కాదు కొన్నాళ్లపాటు జైల్లో కూడా ఉంచారు. ఇప్పుడు మరో యాంకర్ రేవ్ పార్టీలో పట్టుబడినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ యాంకర్ ఇంకెవరో కాదు కొన్ని కామెడీ ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేసి నటిగా మారిన రోహిణి. జబర్దస్త్ లో బాగా ఎక్కువగా కనిపిస్తున్న ఆమె మధ్య మధ్య మధ్యలో సినిమాలు కూడా చేస్తోంది. ఆమెకు మంచి పాత్రలు కూడా పడుతున్నాయి. కామెడీ చేసేందుకు మంచి అవకాశం ఉండడంతో అలాంటి కామెడీ పాత్రలు ఆమెతో చేయిస్తున్నారు దర్శక నిర్మాతలు.

Bimbisara 2: వశిష్ట అవుట్.. ఆ డైరెక్టర్ చేతికి బింబిసార 2 బాధ్యతలు

అయితే తాజాగా హేమ రేవ్ పార్టీ వీడియోని పోలినట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది నిజమైన రేవ్ పార్టీ వీడియో కాదు ఏదో ప్రమోషనల్ వీడియో లాగా కనిపిస్తోంది. ఏదో సినిమాకి రోహిణి ప్రమోషన్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెను వెంటాడుతున్న మీడియా ప్రతినిధుల మైక్ మీద అసలు లేని చానల్ సింబల్ కనిపిస్తోంది. అయితే ఇది బర్త్డే బాయ్ సినిమా ప్రమోషన్స్ అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. నాకేం సంబంధం లేదు సార్, బర్త్డే పార్టీ ఉందని చెబితే వచ్చాను అంటూ ఆమె చెబుతుండగా నీకు పాజిటివ్ వచ్చింది అంట కదా అని ఒక మీడియా ప్రతినిధి అడుగుతున్నట్టు కనిపిస్తుంది. దానికి ఆమె నాకు అసలు టెస్ట్లే చేయలేదు ఎలా పాజిటివ్ వస్తుందని అనడంతో పాటు ఈ ఎన్నారైలు బర్త్డే పార్టీ అని పిలిస్తే ముందు వెనకా ఆలోచించకుండా ఏ మాత్రం రాకూడదు అంటూ ఏడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది ప్రమోషనల్ వీడియో అనే విషయం ఇంకా అధికారికంగా రివిల్ చేయలేదు చూడాలి మరి.

Show comments