యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనుకున్న స్థాయి చేరుకోలేకపోయింది. హాట్ ట్రీ ఇచ్చి మరి ‘గుంటూర్ టాకీస్’ వంటి చిత్రాలు చేసిన ఫలితం లేకుండా పోయింది.కానీ ‘జబర్దస్త్’ కామెడీ షో ఆమె దశ తిరిగేలా చేసింది. తెలుగు సరిగా రాక తన ముద్దు ముద్దు మాటలతో, గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు.. ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
Also Read:Nani: నాని ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ రెడీ..!
ముఖ్యంగా సుధీర్ తో రిలేషన్ లో ఉంది అనే వార్తలతో ఆమె మరింత పాపులర్ అయ్యింది.ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే రష్మి హాట్ ఫోటోలు షేర్ చేయడంతో పాటుగా,సామాజిక అంశాల పై స్పందించే తీరు, మూగజీవాలకు ఆమె ఇచ్చే ప్రాముఖ్యత అందరికీ నచ్చుతాయి. జంతువుల పై ఎలాంటి చిన్న దాడి అయిన కూడా ఆమె తట్టుకోలేదు. ఎదుటి వారు ఎవ్వరు అని కూడా చూడకుండా గొడవపడుతంది. ఇలాంటి సందర్భాలు చాలా జరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు కంగారుగా కామెంట్స్ చేస్తున్నారు.. అయితే రష్మి ‘నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.