Pradeep Machiraju:బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర ఏ ఛానెల్ లో ఏ షో చూసిన ప్రదీప్ తప్ప ఇంకొకరు కనిపించరు. అయితే అతను ఎక్కడికి వెళ్లినా పెళ్లి ఎప్పుడు..? పెళ్లి ఎప్పుడు అనే డైలాగ్ మాత్రమే వినిపిస్తోంది. అప్పుడప్పుడో తన స్వయంవరం ప్రకటిస్తూ ఒక షో చేసిన ప్రదీప్ అదంతా షో కోసమే అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత ఎన్నోసార్లు ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే వస్తున్నాయి. ఇక మొన్నటికి మొన్న ప్రదీప్ ఒక పొలిటికల్ లీడర్ కూతురిని వివాహం చేసుకుంటునట్లు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై ఎప్పుడు ప్రదీప్ స్పందించింది లేదు. ఇక తాజగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిపై తానే సెటైర్లు వేసుకున్నాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్.. పెళ్ళెప్పుడు అని అడుగగా.. “అదేంటి నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు అయ్యింది. యూట్యూబ్ లో చూడలేదా..? అంటూ కౌంటర్ వేశాడు. అంటే యూట్యూబ్ లో రోజుకోక అమ్మాయితో ప్రదీప్ పెళ్లి అంటూ థంబ్ నెయిల్స్ పెడుతున్నవారికి ప్రదీప్ గట్టి కౌంటర్ ఇచ్చాడన్నమాట. ఇకపోతే ప్రస్తుతం బిజీ యాంకర్ గా మారిన ప్రదీప్ పెళ్లి వచ్చే ఏడాది జరగనున్నదని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రదీప్ కుటుంబ సభ్యులు అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారట.. త్వరలోనే ప్రదీప్ తన పెళ్లి కబురు చెప్పనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మాచిరాజు పెళ్లాడే ఆ రాణి ఎవరో చూడాలి.
