Site icon NTV Telugu

Anasuya: నీ కాణంగానే వెళ్లిపోయా.. అంటూ ఆది పై అనసూయ ఫైర్!

Anasuya Vs Hyper Aadi,

Anasuya Vs Hyper Aadi,

ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కానీ ఈ సారి కామెడీ కాదు.. ఎమోషనల్, సీరియస్ డైలాగ్స్ అన్నీ కలగలిపిన ఓ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ప్రోమోలో అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన డైలాగ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు హాట్ టాపిక్. జబర్దస్త్ షో 2013లో ప్రారంభమై ఇప్పటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదటి నుంచే ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనసూయ, 2022లో సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా షోకి గుడ్‌బై చెప్పింది. కానీ, తాజాగా షో ప్రత్యేక ఎపిసోడ్ కోసం ఆమె స్పెషల్ గెస్ట్‌గా రీ-ఎంట్రీ ఇవ్వడం ఫ్యాన్స్‌కి ఆనందకర విషయం.

Also Read : S S Rajamouli: బాహుబలి, RRR కాదు.. నా కెరీర్ బెస్ట్ మూవీ అదే..

ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో అనసూయ మాట్లాడుతూ.. ‘నీతో స్కిట్ చేస్తూ ఎంకరేజ్ చేశాను కానీ.. నా ఎక్స్క్లూజివిటి ఏడవలేదు.. అది నా ఏడుపు!’ అంటూ గుండెను పులకించజేసే డైలాగ్ చెప్పింది. ఆమె మాటల్లో ఆవేదన కనిపించింది. హైపర్ ఆది మాత్రం తనదైన శైలిలో ‘నువ్వు అమెరికా వెళ్లినప్పుడు కూడా లింకులు పంపించా.. అది రా మన లింకు!’ అంటూ కామెడీ టైప్ డైలాగ్ వేయడంతో ప్రోమో మరింత రసవత్తరంగా మారింది. అయితే అందుకు అనసూయ ఝలక్ ఇస్తూ.. ‘ఇలాంటివి మాట్లాడుతుంటేనే వెళ్లిపోయాను’ అని తేల్చేసింది. ఈ ఒక్క డైలాగ్‌తో ప్రోమోలోని వాతావరణం సీరియస్ టర్న్ తీసుకుంది. కామెడీ షో అయినా, ఈ ఎపిసోడ్‌లోని బంధాలూ కొత్తగా కనిపిస్తున్నాయి. ప్రజంట్ ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ఫ్యాన్స్ ఆమె రీ ఎంట్రీపై సంబరపడుతుండగా, కొంతమంది ఈ డైలాగ్స్ వెనక ఉన్న నిజాలు తెలుసుకోవాలని ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.

 

Exit mobile version