NTV Telugu Site icon

Anasuya : విజయ్ దేవరకొండతో గొడవ.. మీడియాదే తప్పంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్..

Anasuya Comments On Vijay Deverakonda Issue

Anasuya Comments On Vijay Deverakonda Issue

Anasuya Comments on Vijay Deverakonda Issue: అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి సంపత్ నంది కధ అందించారు. ఈ సినిమాకి మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. బుధవారం నాడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించగా ఈ కార్యక్రమంలో అనసూయకు విజయ్ దేవరకొండతో ఉన్న ఇబ్బందుల నుంచి ప్రశ్న ఎదురైంది. ట్రైలర్లో విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అనే డైలాగ్ ఉంది ఆ డైలాగ్ వింటే మీకూ విజయ్ దేవరకొండకు మధ్య జరిగిన గొడవ గుర్తొచ్చింది ఆ గొడవ సమస్య పోయినట్లేనా అని మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. అయితే తాను అలాంటి విషయాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదని అనసూయ చెప్పుకొచ్చింది.

Mahesh – Rajamouli: కాస్కోండ్రా అబ్బాయిలూ.. ఇక డైరెక్ట్ ఎటాక్!

ఒక సినిమా ద్వారా ఎలా అయితే మెసేజ్ ఇవ్వాలనుకుంటామో నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. ఇలా చేయడం స్టేజ్ మేనేర్స్ కాదు అని చెప్పాలనుకున్నాను అంత కుమించి ఏమీ లేదు. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒకచోటకు వెళ్ళినప్పుడు మన మీద ఫోకస్ ఉంటుంది, లైమ్ లైట్ లో ఉన్నాము అనుకున్నప్పుడు చాలా పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కానీ అది మితిమీరితే అందరికీ తెలుస్తుంది. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అది మీకు ఎందుకు తప్పనిపించలేదు ? మీ అందరికీ ఎప్పుడో ఒకసారి అడుగుదామనుకుంటాను. మీరందరూ మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. అది మీ తప్పే మళ్ళీ మీరే నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నట్లు ఆమె మాట్లాడారు. అయితే సదరు జర్నలిస్ట్ ఇదే విషయం గురించి మేము విజయ్ ని కూడా అడిగాము అంటే సరే ఇప్పుడు అది ఎందుకులే వదిలేద్దామని అనసూయ కామెంట్ చేసింది.

Show comments