NTV Telugu Site icon

‘పుష్ప’లో రంగమ్మత్త.. ఫోటో షేర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. కాగా, కరోనా అడ్డంకులను తట్టుకొని ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పుష్ప షూటింగ్ లో జాయిన్ అయింది. దీనికి సంబంధించి ఆమె తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. కాగా అనసూయ ఇదివరకు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాలో అనసూయను ఏవిధంగా చూపించబోతున్నడనేది తెలియాలంటే.. ఆగస్టు 13 దాకా ఆగాల్సిందే..!